తెలంగాణలో విపత్తుల నిర్వహణ సంస్థ పనిచేస్తుందా..?

by Aamani |
తెలంగాణలో విపత్తుల నిర్వహణ సంస్థ పనిచేస్తుందా..?
X

దిశ, రాజోలి: వర్షాకాలంలో పిడుగుపాటుకు చాలామంది రైతులు, ప్రజలు, జంతువులు బలి అవుతున్న సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాము. ముందుగానే ఏ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయో పసిగట్టే టెక్నాలజీ ఉన్న దాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ విపత్తుల నిర్వహణ సంస్థ లోపం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు తెలంగాణ లో విపత్తుల నిర్వహణ సంస్థ పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ఈ యొక్క విపత్తుల నిర్వహణ సంస్థ ఆ ప్రాంత ప్రజల మొబైల్ కు ఒక సైరన్ తో కూడిన అలర్ట్ మొబైల్ స్క్రీన్ పై పంపినట్లయితే ఆ ప్రాంతం యొక్క రైతులు, ప్రజలు అప్రమత్తం అవ్వడానికి అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ తూతూ మంత్రంగా పనిచేస్తుండడంతో తరచూ మరణాలు సంభవిస్తున్నాయి. ఇకనైనా విపత్తుల నిర్వహణ సంస్థ సరిగ్గా పనిచేసి ఏ ప్రాంతంలో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయో ముందుగానే పసిగట్టి ప్రజలకు చేరవేసే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed