- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథేచ్ఛగా హరితహారం చెట్ల నరికివేత
దిశ, వీపనగండ్ల: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వాలు చెప్తుంటే..విద్యుత్ అధికారులు మాత్రం విద్యుత్ తీగల కు చెట్లు అడ్డంగా ఉన్నాయంటూ వాటిని విచక్షణారహితంగా కొట్టివేస్తున్నారు. వీపనగండ్ల– తూముకుంట రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పెద్దయ్యాయి. స్థానిక సబ్ స్టేషన్ నుంచి తూముకుంట విద్యుత్ స్తంభాలు నాటి 11 కెవి విద్యుత్తు లైన్ ను తీసుకువెళ్లారు. ప్రస్తుతం చెట్లు పెరిగి పెద్దవి కావడంతో..విద్యుత్ తీగలకు చెట్లు అడ్డొస్తున్నాయంటూ విద్యుత్ అధికారులు మండల పరిషత్ అధికారులకు, గ్రామపంచాయతీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సుమారుగా 150 చెట్లకు పైగా విచక్షణారహితంగా జెసిబితో తొలగించారు. ఈ రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు ప్రజలు చెట్లను నరికి వేయడంపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని విలేకరులు ఎంపీడీవో శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా..చెట్లను తొలగించడం నేరమేనని, విద్యుత్ అధికారులు తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను మాత్రమే తొలగించి ఉంటే బాగుండదని అన్నారు. విద్యుత్ అధికారులు తొలగించిన చెట్లను హరితహరంలో పది సంవత్సరాల క్రితం నాటామని, చెట్లు నాటిన అనంతరమే విద్యుత్ లైన్ తీసుకువెళ్లారని ఏపీఓ శేఖర్ గౌడ్ తెలిపారు.