- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలించే నైతిక హక్కు కోల్పోయిందని వెంటనే రాష్ట్రపతి పాలన విధించి కల్వకుంట్ల కుటుంబంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి శిక్షించాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లీకేజీ వ్యవహారంలోని కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియమకాలు అనే ట్యాగ్ లైన్ తో అమరుల త్యాగాల పునాదులపై అధికార పీఠం ఎక్కిన సీఎం కేసీఆర్ కుటుంబం, మరో 30ఏళ్ల పాటు అగ్రకులానికే అధికార హోదాని ఇవ్వాలని కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.
గ్రూప్ 1 పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో నియమించబడిన సభ్యులంతా కూడా బీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారని, ఎంతో గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు కమిటీ సెక్రటరీకి, కంప్యూటర్ ఆపరేటర్లకు ఎలా చేరాయే చెప్పాలన్నారు. సభ్యుల ప్రమేయం లేకుండానే ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్ లో వేసుకునే అవకాశం లేదని, కేవలం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహకారంతోనే పేపర్ లీకేజీ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా ఎంక్వయిరీ ప్రారంభించినప్పటికీ కేవలం ఇద్దరిని మాత్రమే దోషులుగా చిత్రీకరిస్తూ చిన్న కేసుగా పరిగణలోకి తీసుకుంటుందని, చివరికి ఇద్దరి సాక్షులను చంపేసి కంప్యూటర్ లోని సాప్ట్ వేర్ ఆధారాలను తొలగించే పనిలో ఉన్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓఎంఆర్ షీట్లను కూడా తగలబెట్టేలా ప్లాన్ చేసినట్లు ఆయన ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో కాంట్రాక్ట్ పద్దతిన పనిచేసే ఉద్యోగాలు సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు కమిటీ సభ్యుల బంధుమిత్రులకే అమ్ముకున్నారని చెప్పారు. వేలాదిమంది నిరుద్యోగులు అత్యంత బీద కుటుంబం నుంచి వచ్చి కుటుంబానికి దూరంగా ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని అలాంటి పరిస్థితుల్లో పేపర్ లీకేజీ చేసి బడా బాబులు, ధనికుల దొరల పిల్లలకే ఉద్యోగాలు దొరికేలా ఈ వ్యవహారాన్ని నడిపారని అన్నారు. రిటైర్ అయిన అధికారులను నియమించిన సిట్ ద్వారా ఎలాంటి ఫలితం ఆశించలేమని కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా మాత్రమే విచారణ జరపాల్సి ఉందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేవలం సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సంబంధించిందని వేల కోట్ల రూపాయల స్కాం చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందని అలాంటి కేసు విషయంలో ప్రభుత్వం ప్రజల చేత పన్నులు కట్టిన జీతం పొందుతున్న అడ్వకేట్ ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రశ్నించిన వారిని సైతం అతి కిరాతకంగా అరెస్ట్ లు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రామకృష్ణ, రామచందర్, పృథ్వీరాజ్ తదితరులు ఉన్నారు.