- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని బియ్యం బస్తాల అక్రమ రవాణా..
దిశ, బిజినేపల్లి : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని బియ్యం బస్తాల అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు పట్టించారు. ఈ సంఘటన మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు వడ్డించే అన్నం మిగిలితే ఆ భోజనాన్ని మంగనూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పందుల కోసం ప్రతినిత్యం తీసుకువెళ్తుంటాడు.
ఈ క్రమంలో మంగళవారం ఆ వ్యక్తి తన వాహనంలో మిగిలిన అన్నంతో పాటు సుమారు రెండు క్వింటాల్ ల బియ్యాన్ని వేసుకొని వెళ్తున్నాడు. గ్రామస్తులు ఆ వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాహనాన్ని స్టేషన్కు తరలించినట్లు స్థానికుల ద్వారా అందిన సమాచారం. ఆ బియ్యం బస్తాలు వాహనంలో వేసింది ఎవరు..? ఇందులో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇప్పుడే తీసుకెళ్ళారా..? ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకెళ్లారా..? అనే అనుమానాలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పూర్తి విచారణ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.