- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు
దిశ, నాగర్ కర్నూల్ : తాడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో పనులు జరగాలంటే చేతులు తడపాల్సిందే అన్నట్లుగా వ్యవహారాలు సాగుతున్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వసూళ్లలో ఎవరి వాటా ఏంటో.. వెలుగులోకి రాకపోయినా ... వసూళ్లు మాత్రం బాహాటంగా సాగుతున్నాయి. కాగా సిబ్బంది కూడా సకాలంలో కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సిబ్బంది రెండు మూడు గంటలకు మించి పని చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అవినీతి .. అక్రమాలకు తావు లేకుండా.. ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆరోపణలు వస్తే చర్యలు
కార్యాలయంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధితు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.:- కిరణ్మయి, తహసీల్దార్, తాడూరు.