ఎయిర్ గన్‌తో బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్ఐ నారాయణ

by Hamsa |
ఎయిర్ గన్‌తో  బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్ఐ నారాయణ
X

దిశ, మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎస్ఐ నారాయణ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. మద్దూరు మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి వద్ద గన్ ఉన్నట్టు వాట్సప్‌లో మరియు మీడియాలో వచ్చినటువంటి ఫోటో ఆధారంగా చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి, మద్దూరు ఎస్ఐ నారాయణ, ఎంపీపీ ఇంట్లో తనిఖీ చేయగా, మద్దూరు మండల MPP బద్దిపడగ కృష్ణారెడ్డి ఎయిర్ గన్ కలిగివున్నాడని, ఎయిర్ గన్‌కు లైసెన్స్ కలిగివుండాల్సిన అవసరం లేదని ఎస్ఐ తెలిపారు.

దూల్మిట్ట మండలం తోర్నాల గ్రామానికి చెందిన MPTC ఆకుల యాదగిరి పిస్తోల్ పట్టుకుని ఉన్న ఫోటోను వెరిఫై చేసి విచారణ చేయగా,అది అతని స్నేహితుడైన క్లాస్-1 కాంట్రాక్ట్ యొక్క లైసెన్సుడ్ తుపాకీ అని,ఫోటో ఫోజు కోసం మోజు తో పిస్టల్ పట్టుకొని ఫోటో దిగినట్లు తెలిసిందని,గత 6 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో దిగిన ఫోటో అని తెలిసినట్టు తెలిపారు. ఇంతకుముందు ఎయిర్ గన్ తో ఎలాంటి బెదిరింపులకు పాల్పడినట్టు ఆధారాలు లేవని,ఒకవేళ బెదిరింపులకు పాల్పడితే చట్టరీత్యా చర్య లు తీసుకుంటామని ఎస్ఐ నారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed