- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collectorate : మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే కచ్చితంగా ఇవి ఉండాల్సిందే..?
దిశ,గద్వాల కలెక్టరేట్ : రైస్ మిల్లర్లు ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ను పౌరసరఫరాల కార్పొరేషన్ కు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వరి ధాన్యం కొనుగోలుపై మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లర్లు కచ్చితంగా బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్లను సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మిల్లర్లను నాలుగు రకాలుగా విభజించడం జరిగిందని, అందులో గతంలో ఎలాంటి బకాయిలు లేని మిల్లర్లు 10శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అన్నారు. రెండవ రకం మిల్లర్లు గత బకాయిలతో పాటు పెనాల్టీ ఉన్నవారు 20 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ అందించాలన్నారు. మూడవ రకం మిల్లర్లు 100 శాతం బకాయిలు చెల్లించి 25 శాతం పెనాల్టీ పెండింగ్ ఉన్నవారు 25 శాతం పెనాల్టీ లేదా 25 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే నాలుగో రకం మిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్నవారికి ధాన్యం కేటాయించబడదని కలెక్టర్ తెలియజేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అభ్యర్థన మేరకు..మిల్లర్లకు అదనపు మిల్లింగ్ చార్జీలు కూడా అందజేయడం జరుగుతుందని అన్నారు. దొడ్డు రకం ధాన్యానికి క్వింటాలకు 30/- రూపాయలు అలాగే సన్న రకానికి 40/- రూపాయల చొప్పున అదనపు మిల్లింగ్ చార్జీలు అందించడం జరుగుతుందని, మిల్లర్లకు కేటాయించగా మిగిలిన ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోదాములలో భద్రపరచడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యాన్ని సేకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, అందరు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.