power cuts : చినుకు పడితే ఆ గ్రామంలో అంధకారమే..

by Sumithra |
power cuts : చినుకు పడితే ఆ గ్రామంలో అంధకారమే..
X

దిశ, బిజినేపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో చినుకు పడితే ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామంలోని కొంత మంది నాయకులు విద్యుత్ లైన్మెన్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ గా ఉందంటున్నారు. విద్యుత్ సరఫరా లేకపోతే ఫోన్ చేసి వారికి విన్నవిస్తే వారు సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప రాత్రి అయ్యిందంటే గ్రామం అంధకారంలోనే ఉంటుందని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండి, పాలెం గ్రామంలో విద్యుత్తు లేకపోవడంతో గ్రామం అంధకారంలో మగ్గిపోతుందని చెబుతున్నారు. దీంతో విద్యుత్ అధికారులకు, ఏఈకి విషయం తెలపడంతో వారు సమాధానంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామంలోని కొందరు ప్రజలు వాపోయారు.

ముందే వర్షాకాలం కావడంతో దోమలు మలేరియా, డెంగ్యూ వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్నాయని, దానికి తోడు చీకటిని ఆసరాగా చేసుకుని విషసర్పాలు ఇండ్లలోకి వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని ఆ గ్రామంలోని ప్రజలు వారి గోడును వెలిబుచ్చారు. మండలంలోని పాలెం గ్రామం మేజర్ గ్రామపంచాయతీ అవి కూడా అంధకారంలోనే ఉండడం ఎంతవరకు సమంజసం అని గ్రామ ప్రజలు అంటున్నారు. తక్షణమే ఎమ్మెల్యే చొరవ తీసుకొని పాలెం గ్రామాన్ని చీకటి మయాన్ని తొలగించి విద్యుత్ సరఫరా పాలెం గ్రామంలో పూర్తిస్థాయిలో అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకుని పాలెం గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed