- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జడ్చర్లలో దంచి కొట్టిన భారీ వర్షం.. నది ప్రవాహాలను తలపించిన రహదారులు
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీలో శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి ఏకధాటిగా గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలు ఉప్పొంగడంతో జడ్చర్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమై ప్రయాణికులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరానితో స్థానికులు ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది దీంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు జడ్చర్ల 4వ వార్డ్‌లోని వెంకటేశ్వర కాలనీలో నల్లకుంట నిండి వర్షపు నీరు రహదారి పైకి రావడంతో రహదారులు పూర్తిగా జలమయ్యాయి.
దీంతో ఆ ప్రాంతంలో వాహనదారులు, ప్రజలు రోడ్డు దాటడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టణంలోని 16 వార్డులో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని బయటకు వార దూరడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షం వచ్చిన ప్రతిసారి తమ పరిస్థితి ఇదేనని పాలకులు మారిన తమ పరిస్థితి మారడం లేదని 16వ వార్డు కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,
11వ వార్డులో శ్రీనివాస థియేటర్ సమీపంలో 167వ జాతీయ రహదారిపై నదిని తలపించేలా వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు మెల్లమెల్లగా రోడ్డు దాటారు. ఆ ప్రాంతంలో పలు కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతోపాటు కావేరామపేట బాబా నగర్ ప్రాంతంలో భారీగా కాలనీలో చేరడంతో కాలనీలను జలమయమయ్యాయి. కల్వకుర్తి వైపు వెళ్లే 167 వ జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆర్ అండ్ బి అధికారులు నత్త నడకన చే పడుతుండడంతో ఆ రోడ్డులో మొత్తం వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆ మార్గ వెంట వాహనాలు వెళ్లడం కష్టతరంగా మారింది.
జడ్చర్ల కమ్యూనిటీ ఆస్పత్రిలో లోని ఓపీ విభాగంలోకి వర్షపు నీరు రావడం పట్ల వైద్య సిబ్బంది రోగులు ఆందోళనకు గురయ్యారు.జడ్చర్ల పట్టణంలో వర్షం పడిన ప్రతిసారి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై పలు కాలనీలలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటేశ్వర కాలనీ లో వర్షపు నీరు ప్రవాహ ప్రాంతాన్ని పలువురు నాయకులు చేరుకొని మున్సిపల్ సిబ్బంది సమాచారం అందించి మున్సిపల్ కార్మికులతో కలిసి వర్షపు నీటిని దారి మళ్ళించే ప్రయత్నాలను చేపట్టారు. జడ్చర్ల పట్టణ ప్రజలకు చినుకు పడిందంటే వణుకు పుడుతుంది. ఆక్రమణకు గురైన మురుగు కాలువలను పునర్నిర్మించి వర్షపు నీరు ఇళ్లల్లోకి రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలు కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు.