గురుకుల పాఠశాల విద్యార్థినికి అస్వస్థత…తాగునీటిని పరిశీలించిన అధికారులు

by Kalyani |
గురుకుల పాఠశాల విద్యార్థినికి అస్వస్థత…తాగునీటిని పరిశీలించిన అధికారులు
X

దిశ మద్దూరు: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని కలుషిత నీటి వల్ల ఎనిమిదో తరగతి విద్యార్థినికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. గురుకుల పాఠశాలలో మిషన్ భగీరథ నీటి సరఫరా కొనసాగుతుంది. మిషన్ భగీరథ నీటి సరఫరా లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో లీకేజీలు ఉన్నాయి. వర్షాకాలం కావడం మిషన్ భగీరథ నీళ్లు తాగడం తో విద్యార్థుల్లో అస్వస్థత గురవుతున్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మహబూబ్నగర్లోని ఎస్ వి ఎస్ చికిత్స కోసం తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్లు కలుషిత నీరు వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తల్లిదండ్రులు చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా జిల్లా మండల స్థాయి అధికారులు రామన్న పంచాయతీ కార్యదర్శి రామునాయక్,మిషన్ భగీరథ ఏ ఈ చెన్నయ్య పాఠశాలను సందర్శించారు. అధికారులు స్పందించి గురుకుల విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story