- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుంది: ఎమ్మెల్యే ఆల
దిశ, అడ్డాకుల: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పొన్నకల్, శాఖాపూర్, తిమ్మాయిపల్లి గ్రామాలలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం రవాణ చేసేందుకు లారీలు సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్న పై అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ నాగార్జున రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు శెట్టి నాయక్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఖాజా గోరి, ప్రచార కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, రాచాల రైతుబంధు అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.