ఉత్తమ పోలీసు సేవలకు పతకాలు ప్రకటించిన ప్రభుత్వం

by Naveena |
ఉత్తమ పోలీసు సేవలకు పతకాలు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా ప్రజలకు,పోలీస్ శాఖకు ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, జిల్లా నుండి నలుగురికి పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు,నలుగురికి సేవా పథకాలను నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం రాత్రి ప్రభుత్వం ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ ఆర్ఎస్ఐ డిఏఆర్ లో పనిచేస్తున్న ఎండి.గయాసుద్ధీన్,రాజాపూర్ పీఎస్ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న డి.లక్ష్మారెడ్డి,బాలానగర్ ఏఎస్ఐ (పీఎస్ అటాచ్డ్ డిజీపీ ఆఫీస్)గా పనిచేస్తున్న అతీకుర్ రెహమాన్,మహబూబ్ నగర్ ఉమెన్స్ పీఎస్ లో పనిచేస్తున్న కె.వనజారెడ్డి లు 'ఉత్తమ సేవా పథకం' కు ఎంపికయ్యారు. అలాగే పోలీస్ ప్రధాన కార్యాలయంలోని డిఏఆర్ అదనపు ఎస్పీ ఎస్.సురేష్ కుమార్,డిఏఆర్ ఏఆర్ఎస్ఐ లోని వై.దామోదర్,డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కె.విజయ్ కుమార్ (1642),డిసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ గౌడ్(1643) లు 'సేవా పథకం' కు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి వీరందరకీ అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story