- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ అధికారులా ? బీఆర్ఎస్ పార్టీ తొత్తులా ? : బీఎస్పీ
దిశ, ఉండవల్లి : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని అధికారులు అలంపూర్ చౌరస్తాలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి ,మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం అలంపూర్ చౌరస్తాలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు మూడు రోజులలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి బీఎస్పీ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్లను తొలగించారని, మహాశివరాత్రి ఉత్సవాలకు అలంపూర్ జోగులంబా అమ్మవారి ఆలయాల దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేశారని, వాటికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు.
దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారులు తొత్తులుగా పనిచేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. పుల్లూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచారన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కూతురు కవిత అల్లంపూర్ ను ఎంతవరకు అభివృద్ధి చేశారో చూడటానికి వచ్చారా ? అని విమర్శించారు. అలంపూర్ చౌరస్తా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా కనీసం ఆర్టీసీ డిపో, పోలీస్ స్టేషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూడడానికి వచ్చారా ? అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన బీఎస్పీ నాయకులు ప్రభుదాస్, తిరుపాల్ లక్ష్మన్న, సుందర్రాజు, రవి, మహేందర్, మధు, శివ తదితరులు పాల్గొన్నారు.