- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector Adarsh Surabhi : ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలి..
దిశ, వనపర్తి : కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆధునిక సమీకృత మార్కెట్, వే సైడ్ మార్కెట్, ఇతర ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తెచ్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పెబ్బేరు వెళ్లే రోడ్డులో 1.6 ఎకరాల స్థలంలో రూ. 2.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక వే సైడ్ మార్కెట్ ను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. 78 షాపులతో పాటు మరుగుదొడ్లు, క్యాంటీన్, తాగు నీరు, ఫ్యాన్ లు, పిల్లలు ఆదుకునేందుకు ఆట స్థలం వంటి సకల సదుపాయాలతో నిర్మించిన వే సైడ్ మార్కెట్ ను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
కూరగాయలు అమ్మే వ్యాపారులు, రైతులు స్వయంగా పండించిన కూరగాయలు, పళ్ళు అమ్ముకునే వారికి ఈ వే సైడ్ మార్కెట్ లో ఉచితంగా షాపులు కేటాయించాలని సూచించారు. ఇక నుంచి వనపర్తి పట్టణంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మడానికి వీలు లేదని, కూరగాయలు అమ్మే సంఘాల వారితో మాట్లాడి వే సైడ్ మార్కెట్, సమీకృత మార్కెట్ కు తరలించాలన్నారు. పట్టణంలో రూ. 19.50 కోట్ల వ్యయంతో 2.4 ఎకరాల స్థలంలో అత్యాధునికమైన పద్ధతిలో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనాన్ని సందర్శించారు. కూరగాయలు, పళ్ళు రిటైల్ గా అమ్మే వ్యాపారులకు ఈ షాపులు ఉచితంగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మటన్, చికెన్ వ్యాపారస్తులు రోడ్డు పక్కల విక్రయాలు అనుమతించరాదని, సమీకృత మార్కెట్ లో అన్ని సదుపాయాలతో నిర్మించిన షాపులను కేటాయించాలని సూచించారు.
అదే విధంగా దాదాపు 81 షాపులు ఉన్నాయని వాటిని మార్కెట్ విలువ ఆధారంగా ఆయా వ్యాపారాలు చేసుకునేందుకు షాపులు అగ్రిమెంట్ చేసుకొని కేటాయించాలసి ఆదేశించారు. అదేవిధంగా సూపర్ మార్కెట్ ఏర్పాటుకు చాలా అనువైన సదుపాయాలు ఉన్నందున ఆసక్తి ఉన్న సూపర్ మార్కెట్ వ్యాపారులకు రెంటల్ బెస్ అగ్రిమెంట్ చేసుకొని ఇవ్వాల్సిందిగా సూచించారు. కూరగాయలు అమ్మే వ్యాపారులు, పళ్ళు అమ్మేవారు, రోడ్డుపై వ్యాపారాలు చేసే వారితో మాట్లాడి వారికి అవసరమైన షాపులు కేటాయించి సమీకృత మార్కెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సురవరం సాహితీ కళాభవన్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ అందులో అవసరమైన ఫర్నిచర్, ఇతర సదుపాయాల ఏర్పాటు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీర్ మల్లయ్య, ఇతర అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.