Collector Adarsh ​​Surabhi : ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలి

by Aamani |
Collector Adarsh ​​Surabhi : ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలి
X

దిశ,వనపర్తి : సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులు,డాక్టర్లను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో సీజనల్ వ్యాధుల నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కీటక జనిత వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు నమోదు అయిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రైవేట్ ఆసుపత్రిలో పాజిటివ్ కేసు నమోదు అయిన వెంటనే జిల్లా వైద్య అధికారి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలని సూచించారు.పాజిటివ్ వచ్చిన వ్యక్తి పేరు, సెల్ నెంబర్, పూర్తి చిరునామా గ్రూప్ లో పెట్టాలని చెప్పారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులతోపాటు చుట్టూ పక్కల జ్వరం సర్వే చేయడం, రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, అధికారులు పాజిటివ్ వచ్చిన ఇంటికి చేరుకొని దోమల వ్యాప్తి నివారణ చర్యలు పైర త్రియం స్ప్రే చేయాలని తీసుకోవాలన్నారు.జ్వరం తో వచ్చే ప్రతి ఒక్కరి నుండి రక్త నమూనాలు సేకరించి డయగ్నోస్టిక్ కొరకు ఎలిజా సెంటర్ కు పంపించాలన్నారు.అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య ఖర్చుల ధర సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.ఆసుపత్రుల్లో పని చేసే మహిళా డాక్టర్లకు, మహిళా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రత చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయచంద్ర మోహన్,ఏఎస్పీ రామదాసు తేజావత్,డాక్టర్ లు రంగ రావు, సాయినాథ్ రెడ్డి,చైతన్య గౌడ్,పి హెచ్.సి ల మెడికల్ ఆఫీసర్లు, ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed