కారాగారంలో గాంధీ జయంతి వేడుకలు

by Naveena |
కారాగారంలో గాంధీ జయంతి వేడుకలు
X

దిశ ,మహబూబ్ నగర్: జైలు జీవితం పూర్తి అయ్యాక పరివర్తన చెంది మంచి వైపు అడుగులు వేస్తూ..నిజాయితీగా బతకాలని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి బి.పాపిరెడ్డి హితవు పలికారు. బుధవారం గాంధీ జయంతి,ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా..ఆయన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్పీ జానకిలతో కలసి స్థానిక జిల్లా కారాగారంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనిషి పుట్టుకతో నేరస్తుడు కాడని,చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం,క్షణికావేశంలో,విచక్షణ కోల్పోయి చెడు వైపు పయనించి నేరస్తులుగా మారుతారని ఆయన అన్నారు. స్వాతంత్రోద్యమంలో మహాత్మాగాంధి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారని,జైలులో ఉన్న దారుణ పరిస్థితులను గమనించి,ఖైదీలను కూడా మనిషిగా చూడాలని,వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోహన్ రావు,శివేంద్ర ప్రతాప్,జడ్జీ కళ్యాణ చక్రవర్తి,డిఎల్ఎస్ఏ జడ్జి ఇందిర,జైలు సూపరింటెండెంట్ వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed