- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమామహేశ్వర దేవస్థానానికి నిధులు కేటాయిస్తాం : మంత్రి జూపల్లి
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగపూర్ గ్రామ సమీపంలో నల్లమల కొండఫై వేలసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి ఆలయ అభివృద్ధిపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఉమా మహేశ్వర ఆలయ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయిస్తానన్నారు. ఆలయం దిగువన ఉన్న పంచలింగలా వద్ద నూతన హంగులతో కల్యాణ మండపం ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారని చైర్మన్ తెలిపారు. గత రెండు నెలల క్రితం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నల్లమల్ల పర్యటన వచ్చిన సందర్భంగా.. నల్లములను టూరిజం హబ్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆనాడు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రిని చైర్మన్ శాలువాతో సన్మానించి సత్కరించారు.