- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మకానికి అలుగులు..లక్షల్లో వ్యాపారం..చివరకు ఏమైందంటే..?
దిశ,అచ్చంపేట : అలుగు జంతువులను అడవిలో పట్టుకొని జోరుగా వ్యాపారం చేస్తున్న తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లమల్ల కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఠా వన్యప్రాణులను పట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో ముఠాను అటవీశాఖ స్పెషల్ బ్రాంచ్ అధికారులతో పాటు..స్థానిక అధికారులు ట్రేస్ అవుట్ చేస్తూ నిఘా పెట్టారు. దీంతో నిందితులు అలుగు జంతువును తరలిస్తూ.. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద అటవీ శాఖ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది.
వేలు ఇచ్చి లక్షల్లో సొమ్ము...
వన్యప్రాణులను అమ్మకాలు చేస్తున్నా ముఠా గత కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నల్లమల్ల ప్రాంతంలోని పదరా మండలం మద్దిమడుగు రేంజ్ పరిధిలోని కృష్ణా రివర్ సమీపంలోని అడవి నుంచి అలుగు అనే జంతువును తరలిస్తూ.. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. స్థానిక అమాయక ఆదివాసులను వేల రూపాయల ఆశ చూపి ఆ ముఠా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆ ముఠా గత 20 రోజుల క్రితం ఒక జంతువును అమ్మకం చేయగా..వారిని ట్రేస్ అవుట్ చేసిన అటవీశాఖ స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారిని పట్టుకుని కూపీ లాగితే అసలు విషయాలు బయటకు వచ్చినట్లు తెలిసింది.
అలుగు వన్యప్రాణి వ్యాపారం గత కొంతకాలంగా వరంగల్ భూపాలపల్లి జరుగుతుందని,అది రెండు తెలుగు రాష్ట్రాలలో దానికి సంబంధించిన ముఠా ఉన్నారని,ఈ క్రమంలో నల్లమల్ల ప్రాంతాన్ని కూడా వారు అనువైన ప్రాంతంగా ఎంచుకొని హైదరాబాద్ కేంద్రంగా ముఠా తన పనిని చాలా సులువుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. సుమారు 20 రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ములుగు జంతువుతో పట్టు పడడంతో..వారిని విచారించగా వ్యాపారం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఆ జంతువులను సేకరిస్తున్నారు అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ తరుణంలోనే జడ్చర్ల ప్రాంతానికి చెందిన మరో మధ్యవర్తి వ్యాపారి నల్లమల్ల ఆదివాసులతో పరిచయం ఏర్పాటు చేసుకొని ఆ జంతువును అప్పగిస్తే వేల రూపాయలు ఇస్తానని ఆశ చూపి తాను మాత్రం 8 నుంచి 10 లక్షల మధ్య హైదరాబాదు ముఠాకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ ముఠా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 50 నుంచి 80 లక్షల మధ్య బేరం కుదుర్చుకొని వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.
పట్టుబడ్డ 11 మంది ముఠా సభ్యులు ?
వన్యప్రాణుల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీశాఖ స్పెషల్ బ్రాంచ్ స్థానిక అధికారులు సుమారు 30 మంది నిఘా పెట్టి.. మద్దిమడుగు నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా జడ్చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా ఈ వ్యాపారం నల్లమల నుంచి జరుగుతుందని అందుకు ఇద్దరు వ్యక్తులతో పాటు..నల్లమల్లలోని పదర మండలంలోని మద్దిమడుగు,పిల్లిగుండు, చిట్లగుంట, వంకేశ్వరం గ్రామాలకు చెందిన 8 మందిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలు మరికొన్ని గంటలలో జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారి మీడియాకు తెలుపనున్నట్లు తెలిసింది .