- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫతేపూర్ మైసమ్మ దేవస్థాన పాలకవర్గం ఏకగ్రీవ ఎంపిక..
దిశ, నవాబుపేట: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఫతేపూర్ మైసమ్మ దేవస్థాన పాలకవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పాలకవర్గం చైర్మన్ గా కాకర్ల పహాడ్ గ్రామానికి చెందిన పాశం కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పాలకవర్గ సభ్యులుగా దండు రాములు, అంకం వెంకటేష్, కొండ నాయక్, పాశం నర్సింహులు, కమ్మరి ఆంజనేయులు, పాశం యాదయ్య, జి శ్రీనివాసులు, ముర్గని మాధవులు, తలారి మొగులయ్య, జి రాజేందర్, శేరి అనిత, పిచ్చకుంట్ల గోవిందమ్మలు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అవుసుల వీరాచారి నియమితులయ్యారు.
వీరి ఎంపికను దృవీకరిస్తూ దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం నూతన పాలకవర్గం ఎంపికలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించినట్లుగా స్పష్టమవుతుంది. ఏది ఏమైనా గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి, పదవి విరమణ అనంతరం పూర్తిస్థాయి బీఆర్ఎస్ నాయకుడిగా పార్టీకి విశిష్టంగా సేవలందిస్తున్న పాశం కృష్ణయ్యను చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.