- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే కసిరెడ్డి
దిశ, కల్వకుర్తి : గత ప్రభుత్వం పాటించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు టాకూర్ బాలాజీ సింగ్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి, బాలాజీ సింగ్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలో జోడెద్దుల పాలన కొనసాగుతుందని, పేదలు, ధనిక అనే తేడా లేకుండా ఇద్దరిని సమదృష్టితో చూస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు రుణమాఫీ చేస్తామని, అర్హులైన ప్రతి పేదలకి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందజేస్తామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కై 204 కోట్లు మంజూరయ్యాయన్నారు. కొట్ర గేటు నుంచి కల్వకుర్తి కి ఫోర్ లైన్స్, కల్వకుర్తి – మాదారం – కడ్తాల్ వరకు రోడ్డు కాగా, వెల్దండ నుంచి సిరసనగండ్ల డబుల్ రోడ్, జూపల్లి – వంగూర్ గేటు వరకు రోడ్డు వెడల్పు, కోనాపూర్ – మాడ్గుల రోడ్, దేవరకొండ – మాడ్గుల రోడ్లకై గ్రాంట్ మంజురయ్యిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాగ్ధానాలు కాగితాలకే పరిమితమయ్యాయని, వేల కోట్లు అప్పులు చేసి ఖజానాను కొల్లగొట్టారని ఎమ్మెల్యే అన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, నేడు రేవంత్ పాలనలో విద్యా, యువత, రైతులపై సమదృష్టి పాలన కొనసాగడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుందని అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ఉంటుందని, రుణమాఫీతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కసిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చెప్పుడు వరకేనని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు రేవంత్ పాలనలో సాద్యమన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల బిఆర్ఎస్ సమిష్టి కుటుంభ పాలనలో రాచరికపు, నియంతృత్వ పాలనా సాగిందన్నారు. నియోజకవర్గం లోని పలు మండలాల భూనిర్వాసితులకు పరిహారం మంజూరయ్యిందని, నియోజకవర్గానికి తనకు ఆత్మీయ అనుబంధం ఉందని, ఆఖరి దశలో ఉన్నా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
గత ప్రభుత్వంలో పనులు చేపించిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూ. పెండింగ్ లో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నా బకాయిలు ఇచ్చామన్నారు. త్వరలోనే ప్రజలకు ఇచ్చిన పూర్తి వాగ్ధానాలు నెరవేరుస్తామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసమే 204 కోట్ల రూ. మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, అనసూయ సీతక్కకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి, వెల్దండ మాజీ సర్పంచ్లు ఆనంద్ కుమార్, భూపతి రెడ్డి, కౌన్సిలర్లు గోరటి శ్రీనివాస్, ఇజాజ్, బాలు నాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాంరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.