రోడ్డు నిర్మాణ పనులకు రైతులు సహకరించాలిః కలెక్టర్ బీఎం సంతోష్

by Nagam Mallesh |
రోడ్డు నిర్మాణ పనులకు రైతులు సహకరించాలిః కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గట్టు అభివృద్ధి కోసం, భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గట్టు మండల తహశీల్దార్ ఆఫీసులో హైవే అథారిటీ అధికారులతో రహదారి నిర్మాణం సంబంధిత భూముల వివరాలను, భారమాత రహదారి మాపింగ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు, మిగులు భూములకు సర్వీస్‌రోడ్లు, బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని, రైతులకు నష్టపరిహారం క్రింద రైతుల కోరిక మేరకు రెండో విడతగా పది రోజులలో డబ్బులను అందేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. సర్వే నెంబర్ 300 మాచర్ల నుండి ఆరగిద్దకు రోడ్డు లింక్ కల్పిస్తామన్నారు. బ్రిడ్జి, అండర్ పాస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరిత రాణి, ఎన్.హెచ్.ఎ.ఐ మేనేజర్ కోట బాబు, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story