Mid day meals : అధికారుల నిర్లక్ష్యం.. అమలు కాని మధ్యాహ్న భోజన పథకం..

by Sumithra |   ( Updated:2024-08-01 10:39:37.0  )
Mid day meals : అధికారుల నిర్లక్ష్యం.. అమలు కాని మధ్యాహ్న భోజన పథకం..
X

దిశ, పెంట్లవెల్లి : అధికారులు నిర్లక్ష్యం వల్ల మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఈ ఘటన పెంట్లవెల్లి పరిధిలోని యంగంపల్లి తండా ప్రైమరీ స్కూల్లో, మాధవస్వామి నగర్ గ్రామాల్లో గురువారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటికి మధ్యాహ్న భోజనం అమలు కావడం లేదని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ సందర్భంగా యంగంపల్లి హెచ్ఎం మహేష్, మాధవస్వామి నగర్ హెచ్ఎం ఆంజనేయులు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి అధికారులకు సమాచారం ఇచ్చినా కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు టాయిలెట్స్, బాత్రూం సౌకర్యం లేక బయటకు వెళ్తున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed