- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతలు అధైర్య పడవద్దు.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
దిశ ప్రతినిధి, వనపర్తి : అన్నదాతలు ఎవరు అధైర్య పడవద్దని, పండించిన ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. శనివారం వనపర్తి వ్యవసాయ మార్కెట్ లో మెప్మా, సహకార సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నాలు పండించిన ప్రతి రైతుకు రూ. 500 లను అదనంగా చెల్లిస్తామన్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో మహిళా సంఘాల ద్వారా ఒక 151, సహకార సంఘాల ద్వారా 117, మెప్మా ద్వారా 2 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. పదవులు పోయిన బీఆర్ఎస్ నాయకులు అన్నదాతల పై మొసలి కన్నీరు కారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల దుష్ప్రచారాలను ఎవరు నమ్మకూడదని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అవసరం ఉన్న మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, స్థానిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే మరికొన్ని సెంటర్లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు.
కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకువచ్చే అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. గన్ని బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా కొనుగోల్లు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతుల పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకోవాలని, డబ్బులు చెల్లింపుల్లోనూ ఎటువంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్ లో పొందుపరుస్తూ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మెప్మా అధికారులు, సహకార సంఘాల సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, అన్నదాతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.