- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్ నగర్ కు ఇంజనీరింగ్ కళాశాల - కొల్లాపూర్ సభలో సీఎం ప్రకటన
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్, కొల్లాపూర్ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శనివారం కొల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అవసరమైన్ని మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐదు మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నాము అని చెప్పారు. ఇప్పుడు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాలను, కొల్లాపూర్ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు మెడికల్, పాలిటెక్నిక్, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఇంజనీరింగ్, మరో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు అవకాశాలు మరింత మెరుగు పడనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.