- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
SP Janaki : నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : నేరం చేసిన నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. శనివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీపీ, ఏపీపీ, సీఐ, ఎస్.హెచ్.ఓ, కోర్టు లైసన్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులతో నేరాలు, శిక్షల పై జరిగిన రివ్యూ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. నేరాలకు పాల్పడితే శిక్ష పడుతుందనే భయం కలగాలని, కేసుల్లో శిక్షల శాతం పెరగడం ద్వారా నేరాలు అదుపులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.
నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్థులను కట్టడి చేయాలంటే పకడ్బంది దర్యాప్తు నిర్వహించి సరైన సాక్ష్యాధారాలైన సాక్షుల వాంగ్మూలం, సాంకేతిక, వైద్య ఆధారాలను సేకరించి వాటిని సరియైన పద్ధతిలో కోర్టుకు సమర్పించడం ద్వారా నేరస్తులకు కోర్టులో శిక్ష విధిస్తారని ఆమె వివరించారు. ముఖ్యంగా నేరస్థులకు శిక్ష పడటం ద్వారా బాధితులకు పోలీస్ వ్యవస్థ పై మరింత నమ్మకం పెరుగుతుందని ఎస్పీ అన్నారు. అనంతరం పీపీ, ఏపీపీ, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుళ్లను సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేశారు.