- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు నెలల్లో ప్రతి గ్రామానికి తాగునీరు : కలెక్టర్ తేజ్ నందలాల్ పవార్
దిశ, గోపాల్ పేట : రెండు మాసాల్లో ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజ్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రజలు స్వచ్ఛమైన తాగునీరు అందక ఎన్నో రోగాలకు గురయ్యారన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందని తెలిపారు. రేవల్లి మండలంలోని గౌరీ దేవి పల్లి గ్రామంలో నాలుగు జిల్లాలకు సరిపడే స్వచ్ఛమైన తాగునీరును అందించడం కోసం పెద్ద ఎత్తున మిషన్ భగీరథ ఫిల్టర్ సంపును ఏర్పాటు చేశారని కలెక్టర్ అన్నారు.
దాని ద్వారా రేవల్లి మండలం, గోపాల్పేట మండలంలో ఉన్న 24 గ్రామాలకు నిత్యం నీరు అందించేందుకు గతంలో గోపాల్పేట లో రామన్ పాడు పంప్ హౌస్ ద్వారా కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి జిల్లాలకు తాగునీరును అందించేదని, ప్రస్తుతం దానిని మిషన్ భగీరథ గా మార్చి కోట్ల రూపాయలతో మరో మిషన్ భగీరథ పంప్ హౌస్ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ పనులు రెండు నెలలలో పూర్తి అవుతాయని తెలిపారు. వెంటనే ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నత అధికారులు మిషన్ భగీరథ పంప్ హౌస్ పనులను పరిశీలించి వేగవంతంగా చేపట్టాలని గుత్తేదారుకు తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈ ఈ మెగా రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు జైపాల్ రెడ్డి, విజయకుమార్, ఏఈలు మొగులయ్య, శివకుమార్, తహసీల్దార్ సునీత ఎంపీడీఓ హుస్సేన్ అప్ప, ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు కోటీశ్వర్ రెడ్డి, తిరుపతి యాదవ్, ఎంపీటీసీలు కేతమ్మ, ఆప్షన్స్ సభ్యులు మతిన్ పాల్గొన్నారు.