Osmania University : ఉద్యోగాల భర్తీ కోసం ఓయూలో నిరుద్యోగ జాక్ ర్యాలీ

by M.Rajitha |
Osmania University : ఉద్యోగాల భర్తీ కోసం ఓయూలో నిరుద్యోగ జాక్ ర్యాలీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీకి సంబంధించిన నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ(Telangana Unemployment JAC) చైర్మన్ మోతీలాల్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ర్యాలీ నిర్వహించారు. మెయిన్‌ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్‌ కళాశాల(Arts College) వరకు ర్యాలీ చేపట్టి, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్‌నాయక్‌ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఇప్పటికీ ఇచ్చిన హామీని నిలుపుకోకపోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపాల్సి వస్తోందని, వెంటనే రెండు లక్షల ఉద్యోగాల జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వారంలోగా జాబ్‌ క్యాలెండర్‌తో పాటు డిగ్రీ అర్హతతో 12 వేల వీఆర్‌వో ఉద్యోగాలు, డిప్లొమా ఇన్‌ సివిల్‌ అర్హతతో డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, కుల సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story