- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటింటికి సీపీఐ పాదయాత్ర : సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు..
దిశ ప్రతినిధి, గద్వాల : దేశ భక్తి ముసుగులో దేశానికి నష్టం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతరేకంగా ఈనెల 14 నుంచి జరిగే ఇంటింటికీ సీపీఐ పాదయాత్రను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పిలుపు నిచ్చారు. భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా ముఖ్యుల సమావేశం శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్ లో పెద్దబాబు అధ్యక్షతన జరిగింది. 70 ఏళ్లలో ఎన్నడు లేని విషపూరిత విద్వేష సమస్యలు నేడు దాపురించాయని దీనికి కారణం బీజేపీ అని దేశ ప్రజలకు అర్తమైందన్నరు.
రాజ్యంగా మూలాస్థంబాలను లౌకిక ప్రజాస్వామ్య సూత్రాలను నాశనం చేస్తున్నందున సీపీఐ జాతీయ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు జిల్లాలో ఈనెల 14 న అంబేడ్కర్ జయంతి రోజున పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. పాదయాత్రలకు సంబంధించి నియోజికవర్గానికి, మండలాలకు ఇంఛార్జి లను సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకుల పెద్దబాబు, రంగన్న, ఆశన్న, గోపాల్, పరమేష్ చెన్నయ్య, వెంకట్రాముడు, వెంకటేష్, కృష్ణ, జగదీశ్వరి , శంకర్ ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.