పాత మొబైల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మకండిః ఎస్పీ జానకి

by Nagam Mallesh |
పాత మొబైల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మకండిః ఎస్పీ జానకి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాత సెల్ ఫోన్ లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్ళ మోసాలకు అంతులేకుండా పోతుందని, పాత సెల్ ఫోన్ లతో వారు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు. గోదావరిఖని, మేడిపల్లి ఎన్టీపీసీ ఏరియాలో బీహార్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారాన్ని అందుకున్న రామగుండం సీసీపీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు. విచారణలో వారి పేర్లు మహ్మద్ షమీమ్, అబ్ధుల్ సలాం, మహ్మద్ ఇఫ్తికార్ గా గుర్తించామని.. ప్రజల నుండి తక్కువ ధరకు కోనుగోలు చేసిన సుమారు 4 వేల మొబైల్ ఫోన్లను.. 3 గోనె సంచుల్లో పట్టుకెళ్తున్నట్టు తెలిపారు. ఆ గోనె సంచులతో పాటు మూడు బైకులను స్వాధినపరుచుకున్నామని.. వాటిని జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ లాంటి తదితర ప్రాంతాల సైబర్ మోసగాళ్ళుకు సరఫరా చేసి వాటితో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆమె వివరించారు. పాత మొబైల్ ఫోన్ లలో సిమ్ తీసేసినా మన సమాచార డేటా ఉంటుందని.. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పాత మొబైల్ ఫోన్ లను అమ్మకుండా ధ్వంసం చేయాలని ఆమె సూచించారు.

Next Story

Most Viewed