RTC hospital : ఆర్టీసీ క్లీనిక్ మూడునాళ్ళ ముచ్చటేనా ?

by Sumithra |
RTC hospital : ఆర్టీసీ క్లీనిక్ మూడునాళ్ళ ముచ్చటేనా ?
X

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం బస్టాండులో ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని రకాల జబ్బుల వైద్య పరీక్షలకు, ఫార్మసిస్ట్ తో పాటు ఒక డాక్టర్ను నియమిస్తే పది రోజులుగా డాక్టర్ రావడం లేదని, ఇక్కడ నియమించిన డాక్టర్ ను మహబూబ్ నగర్ ఆర్టీసీ క్లీనిక్ కు బదిలీ చేశారని ఉద్యోగులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిని గత నెల 11 న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి చేత ఎంతో అట్టహాసంగా ప్రారంభింపజేసి, 15 రోజుల్లోపే డాక్టర్ లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారని కొందరు ఉద్యోగులు విమర్శించారు.

పాలెం బస్టాండ్ లో నెలకొల్పిన ఈ ఆసుపత్రిలో కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ డిపోలకు సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల వైద్య సేవల కై నెలకొల్పారని, ప్రారంభించి నెలరోజుల్లోపే డాక్టర్ ను బదిలీ చేయడం సరి కాదని విమర్శలు వినబడుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చొరవ తీసుకొని పాలెం బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగులకు నియమించి ఆసుపత్రిలో డాక్టర్ ఉండేవిధంగా చూడాలని కొందరు ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. దానితో పాటు డాక్టర్ వచ్చినా సమయ పాలన పాటించకుండా ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో రోగులు ఉన్నారని, ఇప్పటికైనా సమయపాలన పాటించి పాలెం బస్టాండులో నెలకొల్పిన ఆసుపత్రిలో డాక్టర్ ఉండేవిధంగా చూడాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుచున్నారు.

Advertisement

Next Story

Most Viewed