‘పది’ పరీక్ష కేంద్రాలలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..

by Kalyani |
‘పది’ పరీక్ష కేంద్రాలలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, పెబ్బేరు: పదవ తరగతి పరీక్షల సందర్భంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ హైస్కూల్ పదవతరగతి పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగు విధానాన్ని అక్కడ ఉన్న అధికారులను, ఎస్ఐ జగదీశ్వర్ ను అడిగి తెలుసుకొని పోలీస్ బందోబస్తును తనిఖీ చేసి భద్రతాపరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించరాదని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరిని లోపలికి రానివ్వకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదని ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story