- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా..
దిశ, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆర్ఓబీ రెండు వైపుల సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు కొండ అంజన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఆర్ఓబీ పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోకి వెళ్లడం లేదని ప్రయాణికులను ఆర్ఓబీకి చివర వైపులా దింపుతున్నారని అన్నారు. ప్రయాణికులు ఎండల నిలబడి అనారోగ్యానికి గురవుతున్నారని ప్రమాదం ఎటు నుంచి వస్తుందోనని ఆందోళనతో వాహనదారులు సతమతమవుతున్నారు.
ఆర్ఓబీపై లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయని బస్సు బస్టాండ్ లోకి రాకుండా ఊరి బయటనే ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం అక్కడి నుంచి ప్రయాణికులు నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులతో మాట్లాడి తాత్కాలిక బస్టాండ్ కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రమాదాలు జరిగితే బిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కార్యదర్శి నారాయణరెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎర్నాగి రాజు, ఉపాధ్యక్షుడు అమరేందర్ రెడ్డి , అనిల్ కుమార్ శేఖర్ రెడ్డి, దేవన్న, పులి వీరేష్, కృష్ణ యాదవ్, నరేష్ కుమార్ మాధవులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.