- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ను భర్తరఫ్ చేయండి: మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
దిశ, కల్వకుర్తి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి విషయంలో బాధ్యులైన కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విడుదల చేసినా ఒకే నోటిఫికేషన్ లో కూడా అవకతవకలు జరిగాయని, దీనికి కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్ పై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పారు. లీకేజిల ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆమనగల్లు మాజీ జడ్పీటీసీ కండే హరిప్రసాద్, విద్యార్థులు, నిరుద్యోగులు, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.