- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన విజయాలకు తార్కాణాలు.. మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి : తెలంగాణ సాధించిన విజయాలకు దశాబ్ది ఉత్సవాలు తార్కాణాలుగా నిలుస్తాయని రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం నాగవరం తండాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనతో తొమ్మిది ఏళ్లలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రణాళికాబద్ధంగా రైతుబంధు, రైతుభీమా, ఉచితకరెంటు, సాగునీరు, రైతన్నల రాత మార్చాయన్నారు.
విద్య, వైద్యం, సంక్షేమ, ఉపాధి రంగాలు దేశానికి దిక్సూచిలా నిలిచాయన్నారు. ఒకనాడు ఆకలితో అల్లాడిన తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నడంలో పెరిగిన సాగు, పంట దిగుబడి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతిగడపకూ తీసుకెళ్లి వివరించాల్సిన భాద్యత ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, నాయకులు ఉందన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన విజయాలకు తార్కాణాలుగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, నాగవరం రఘుబ్రదర్స్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.