కొత్త టీచర్లకు ఈ మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్..

by Sumithra |
కొత్త టీచర్లకు ఈ మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్..
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : కొత్త టీచర్లకు పాఠశాలలను కేటాయించే ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కావలసి ఉన్నప్పటికిని కొన్ని జిల్లాలలో ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ ఖాళీలు, అప్గ్రేడ్ అయిన పాఠశాలల వివరాలు సేకరించే విషయంలో ఆలస్యం జరగడంతో కౌన్సిలింగ్ ప్రక్రియను సాయంత్రానికి వాయిదా వేయాలని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.

అప్పటికే కౌన్సిలింగ్ సెంటర్లకు హాజరైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ మధ్యాహ్నం వరకు అన్ని జిల్లాల వివరాలను అధికారులు సేకరించడంతో పోస్టింగ్ కౌన్సిలింగ్ ను ఈ మధ్యాహ్నం నుంచి నిర్వహించాలని కమిషనర్ తిరిగి ఆదేశించారు. అప్పటికే తమ తమ ఇళ్లల్లోకి వెళ్లిన కొత్త ఉపాధ్యాయులకు ఆ జిల్లాల కమిటీ సభ్యులు ఆగమేఘాల పై సమాచారం అందజేసి మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం.. కౌన్సిలింగ్ కు హాజరు కావలసిందిగా సమాచారం పంపారు.

Next Story

Most Viewed