- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minor suicide :మైనర్ బాలిక మృతి వెనుక ఉన్న కుట్రను వెలికి తీయాలి..
దిశ, గద్వాల : వడ్డె రాజేశ్వరి మృతికి కారకులైన నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డె రాజేశ్వరి మృతికి కారకులైన సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి..బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాల పట్టణంలో మైనర్ బాలికను ప్రముఖ సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో పనిలో పెట్టుకుని కొన్ని రోజుల తర్వాత ఆ బాలికపై అక్రమంగా దొంగతనం కేసు మోపడంతో,మల్దకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు మైనర్ బాలికను ఇబ్బందులకు గురిచేసి వేధించడంతో.. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు సేవించి,ఆత్మహత్యాయత్నం చేసుకున్న వడ్డే రాజేశ్వరి మృతికి కారణమైన సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఎలాంటి దొంగతనం చేయకున్నా అక్రమంగా దొంగతనం కేసు మోపి, తాను దొంగతనం చేయలేదని మైనర్ బాలిక ఎంత చెప్పినా కూడా వినకుండా మల్దకజోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డె రాజేశ్వరి మృతికి కారకులైన సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, మైనర్ బాలిక అని చూడకుండా ఆ బాలిక కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసి ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు.
నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,నిందితులు ఎన్ని నేరాలు చేస్తున్నా,రాజకీయ పలుకుబడితో పోలీసులను తమ చేతిలో పెట్టుకుని,పేద వర్గాలపై కేసులు మోపి వేధిస్తున్నారాన్నారు. మైనర్ బాలిక చావు వెనక అనేక కోణాలు ఉన్నాయని,అన్ని విషయాలు బయటకు రావాలంటే వడ్డె రాజేశ్వరి మృతదేహాన్ని రీపోస్టుమార్టం నిర్వహించి వాస్తవ విషయాలను బయటకు తీసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి మైనర్ బాలిక చావుకు కారకులైన బండ్ల రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇప్పటివరకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించకుండా,నోరు మెదపకుండా ఉండటం వెనక అంతర్యమేమిటో చెప్పాలని అన్నారు. వడ్డే రాజేశ్వరి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేయటమే కాక వడ్డె రాజేశ్వరి మృతికి కారకులైన బండ్ల రాజశేఖర్ ను అరెస్టు చేసేంత వరకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో.. జిల్లాలో పెద్ద ఎత్తున జిల్లాలో ఆందోళనలు చేయుటకు వెనకడుగు వేయబోమన్నారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు రంగస్వామి, వెంకట్రాములు,ప్రేమ్ రాజ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.