హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by Kalyani |
హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, మక్తల్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నైజమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణతో బడుగు. బలహీన. వెనుకబడిన వర్గాల వారు ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని, ఆయన అన్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ధరలపై నియంత్రణ లేక దేశ, రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.

ఆదివారం సాయంత్రం మక్తల్ పట్టణంలో జాతీయ రహదారి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కార్నర్ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ,కర్ణాటక సాగునీటి మంత్రి బోసురాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి,ఎన్నికల వ్యూహకర్త మాన్వి రామారావు, హాజరుకాగా అనంతమైన సిద్దరామయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, తెలంగాణ నా పోరాటం తో వచ్చిందని జూటా మాటలు చెప్పడం కేసీఆర్ అలవాటు అన్నారు. దేశ అభివృద్ధి కోసం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పు.. రాష్ట్రం అటు కేంద్రంలో పదేండ్ల పాలనలో పదింతల అప్పులు చేసి దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కోట్ల రూపాయలతో నాణ్యతలేని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మద్దతు తెల్పారని వాటిని అమలు చేస్తున్నామని, కేసీఆర్ ప్రభుత్వానికి అనుమానం ఉంటే ప్రత్యేక వాహనం పెడతా వచ్చి చూసుకోవచ్చు అని ఆయన అన్నారు. కర్ణాటకలోని రైతులకు వ్యవసాయానికి 6 గంటల కరెంట్ అవసరమని, తెలంగాణలో 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. కర్ణాటకలో అన్న యోజన కింద ఐదు కిలోల బియ్యాన్ని కాంగ్రెస్ ఇవ్వడంతో, మోడీ ప్రభుత్వం ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించిందని ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని ఆయన అన్నారు.

కర్ణాటకలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించి ప్రజలకు మేలు చేకూర్చామని కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల బాగు పట్టించు కోకుండా రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని, ప్రజలబాగును, శ్రేయస్సు పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపవాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు. కర్ణాటక లో మహిళలకు సాధికారత గాను మహిళలకు రుణాలు ఇస్తున్నామని, కర్ణాటకలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించామని, జనవరి మొదటి తారీకు నుండి గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని వారి పాలనకు అంతం చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రకటించిన ఆరు పథకాలను అమలు చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో,రాష్ట్రంలో అన్ని కులాల, వర్గాల వారు పీఎంలు, సీ ఎం లు అధికారం చేపట్టారని కానీ కేసీఆర్ ప్రభుత్వంలో వారి కుటుంబం వారే మంత్రి పదవులు అనుభవిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, వీరికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకునేందుకు వెనకాడరని అందుకే వారిని పాలదొరాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Advertisement

Next Story

Most Viewed