- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దూకుడు పెంచిన కాంగ్రెస్.. 31న భారీ బహిరంగ సభ
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఓ వైపు అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తూనే ప్రచారంపై ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంక గాంధీలో రాష్ట్రంలో పర్యటించారు. పలు సభల్లో పాల్గొన్నారు. ఈ సభలు విజయవంతం కావడంతో మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 31న కొల్లాపూర్‌లో ‘పాలమూరి ప్రజాభేరి’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. నవంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ మరోమారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్, ప్రియాంక రెండో విడత బస్సులో యాత్రలో పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ తోపాటు పార్టీ ఇంచార్జి థాక్రే కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో వీరంతా పర్యటించనున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.