- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. బీఆర్ఎస్ కార్యకర్తలు
దిశ, మరికల్ : మండల పరిధిలోని వెంకటాపుర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్న తీరును ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లంబాడి తిరుపతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి, ఎమ్మెల్యే ఎస్ .రాజేందర్రెడ్డి చేశారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు అతీతంగా రైతుబంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, మిషన్ భగీరథ, లాంటి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే, కాంగ్రెస్ కార్యకర్తల కన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు అధికంగా ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దని, మేము మీలాగా దిగజారితే మీరు గ్రామాలలో తిరగలేరని హెచ్చరించారు. నా రాబోవు ఎన్నికలలో ఎస్ రాజేందర్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుపై ఓటు వేసి ముచ్చటగా మూడోసారి గెలిపించాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ, విండో చైర్మన్ రాజేందర్ గౌడ్, నాయకులు రాజవర్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డి, గూప నర్సింలు, హరీష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.