- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది : లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల : కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం వారి ప్రయోజనాల కోసమే ఉపయోగించుకొని, ఓటు బ్యాంకుగా చూడడం వల్లనే మైనార్టీలు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారని జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సి. లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే రాష్ట్రంలో ముస్లింల ఆర్థిక స్థితిగతులు దీనంగా మారాయని, తెలంగాణ ముస్లిం, మైనార్టీ స్పోక్ పర్సన్ అబ్దుల్లా సోహెల్, రాష్ట్ర స్టేట్ బోర్డ్ చైర్మన్, మసి ఉల్లా ఖాన్ అన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని ఆర్కే గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మారెడ్డి తోపాటు అబ్దుల్లా సోహెల్ మసీ ఉల్లా ఖాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గంగా, జమున నది లా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఎక్కడ శాంతిభద్రతల సమస్యలను తలెత్తకుండా పరిపాలన కొనసాగించిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారికి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని అన్నారు.
గత పదేళ్లలోకేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు షాదీ ముబారక్ ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనం మైనార్టీ ఓవర్సీస్ పథకం మైనార్టీ బందు ప్రత్యేక మైనార్టీ గురుకలాలు లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తూ మైనార్టీలను వారి అవసరాల నిమిత్తం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో జడ్చర్లలో తాగునీటి సమస్య ఎలా ఉండేదో ప్రస్తుతం ఎలా ఉందో ముస్లిం మహిళలు ఓసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు.
మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని కేవలం ఎన్నికల సమయంలో కనిపించే పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు మతతత్వ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదన్నారు. ప్రజలు ఈసారి ఆలోచించి ఓటు వేయాలని పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేసే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు మరోసారి బీఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసి పనిచేసే ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధికై ముందుకు పంపించాలని ముస్లిం ఓటర్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.