ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం : డీకే అరుణ

by Disha Web Desk 23 |
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం : డీకే అరుణ
X

దిశ,ఊట్కూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఊట్కూర్, బిజ్వర్, పులిమామిడి గ్రామలలో కార్నర్ మీటింగ్ లో డీకే అరుణ మాట్లాడుతూ.. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, రామరాజ్య స్థాపన జరగాలంటే మోడీ ప్రధాని కావాలని అన్నారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో రైతులకు పీఎం కిసాన్, సబ్సిడీ ఎరువులు, పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. ఇచ్చిన హామీలు చేయడం చేతగాక కాంగ్రెస్ నాయకులు తనమీద ఏడుస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. తనపై వ్యక్తిగతంగా తనను వ్యక్తిగత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు. అంతకుముందు మండల కేంద్రంలో డప్పు చప్పుడు, బ్యాండ్ మేళాలు, బాణాసంచాలతో డీకే అరుణమ్మకు ప్రజలు నీరాజనాలు పలికారు.

Next Story

Most Viewed