AP Politics: గెలుపుపై ఇరు పార్టీల ధీమా.. అక్కడ గెలుపు ఎవరిది ?

by Indraja |   ( Updated:2024-05-17 11:03:30.0  )
AP Politics: గెలుపుపై ఇరు పార్టీల ధీమా.. అక్కడ గెలుపు ఎవరిది ?
X

దిశ, ఎర్రగొండపాలెం: ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీలో వలసలు జరగడంతో స్పష్టమైన మెజార్టీ ఎవరిదో ఊహించలేకపోతున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ హవా నడిచింది. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన వ్యతిరేకత రావడం, మండల నాయకుల్లో సఖ్యత లేకపోవడం, ఆధిపత్యం కోసం అంతర్గత గ్రూపు తగాదాలు అసంతృప్తులతో నియోజకవర్గంలో ప్రముఖ నాయకులు కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అప్పటి నుండి వైసీపీలో కొంత భయాందోళన నెలకొంది. అయితే నియోజకవర్గానికి ఇన్చార్జిగా వచ్చిన తాటిపర్తి చంద్రశేఖర్ మొదట్లో కొంత అయోమయానికి గురైన తరువాత నాయకులను దగ్గరికి తీసుకోవడం ప్రతి కార్యకర్తను గుర్తించడం తన సోషల్ మీడియాను బలంగా వినియోగించడం, గ్రామాల్లో మంచినీటి బిల్లు రాక ఇబ్బంది పడ్డ నాయకులకు రూ.49 కోట్లు మంజూరు చేయించడం వంటి పనులు నిర్వహించారు. కార్యకర్తలకు సైతం సహాయ సహకారాలు అందించటం, ఒక ప్రణాళిక బద్ధంగా తన ప్రచారాన్ని కొనసాగించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

కూటమిది ప్రత్యేక వ్యూహం

టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందుగానే వచ్చి నియోజకవర్గంలోని మండలాలు గ్రామాల్లో తిరిగి ప్రజలతో, నాయకులతో మంచి పరిచయాలు ఏర్పరచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి సురేష్ చేసిన తప్పులను ఎత్తిచూపడంలో ఎరిక్షణ బాబు పూర్తిగా విఫలమయ్యారు. టీడీపీలోనూ వర్గాలుగా గ్రూపులుగా ఏర్పడి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశారు.

నియోజకవర్గంలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం పెరగడం, పుల్లల చెరువు, దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాల్లో కొంతమేర మార్పులు రావడంతో టీడీపీ నాయకుల్లో కొంత ఆశలు రేపుతున్నాయి. వైసీపీ మాత్రం గతంలో ఉన్న మెజారిటీ కంటే ఈసారి అధిక మెజార్టీ వస్తుందని తాను మళ్లీ మూడోసారి వైసీపీని గెలిపిస్తానని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో జరిగే ఓట్ల లెక్కింపుతో ఎర్రగొండపాలెం ఎవరిదనేది తేలనుంది.

Read More...

Memes on CM Jagan: అంతా ఐ ప్యాక్ మయం.. ముఖ్యమంత్రి జగన్‌పై మీమ్స్

Advertisement

Next Story

Most Viewed