‘మనఊరు మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Kalyani |
‘మనఊరు మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: మొదటి విడతలో చేపట్టిన మనఊరు మనబడి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనఊరు మనబడిలో మొదటి విడతలో చేపట్టిన పనులు ఇంకా కొన్ని పూర్తి స్తాయిలో పూర్తికాలేదని త్వరగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఏఈ లను ఆదేశించారు.

ఉపాధి హామీ పని రోజులు 180 కి తగ్గకుండా చూడండిమొదటి విడతలో చేపట్టిన మనఊరు మనబడి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

..

ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలి 180 కి తగ్గకుండా చూసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఉపాధిహామీ, పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలపై జడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీలో అవసరమైన పని సృష్టించాలని, ప్రతి గ్రామంలో పని కావాలనుకున్న వారందరికీ పని కల్పించాలన్నారు. పనిచేసిన వారం రోజుల్లో ఎఫ్ టీఓ జనరేట్ చేసి పనిచేసిన కాలానికి ఎన్ని డబ్బులు రావాలో అట్టి పే స్లిప్ చేతికి ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో చెత్తా చెదారం కనిపిస్తే పంచాయతీ సెక్రటరీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా నాటే మొక్కలు 1.5 మీటరుకు తగ్గకుండా చూడాలన్నారు. ఊరి పక్కన పాడు బడిన బావులు కనిపించకుండా పూడ్చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story