Collector Sikta Patnaik రోగం నిర్ధారణ పరీక్షలు ఆస్పత్రిలో జరగాలి

by Aamani |
Collector Sikta Patnaik రోగం నిర్ధారణ పరీక్షలు ఆస్పత్రిలో జరగాలి
X

దిశ, మక్తల్: ఆస్పత్రిలోని సమస్యలు తన దృష్టికి తీసుకురావాటానికి రోగ నిర్ధారణ పరీక్షలు ఆసుపత్రిలో జరగాలని మందుల కొరత ఉండకుండా చర్యలు తీసుకోవాలని రోగులకు తక్షణ వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిబ్బందితో అన్నారు. శుక్రవారం రోజు మధ్యాహ్నం మక్తల్ సివిల్ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలపై దృష్టి సారించాలని ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రికి వచ్చిన రోగులపై నిర్లక్ష్యం చేయరాదని తక్షణ వైద్యం అందించాలన్నా కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన గదులను ఇన్ పేషంట్లకు చికిత్సకై ఉపయోగించాలని ఆస్పత్రిలో సాధారణ కాన్పులు జరిగే లా ప్రయత్నించాలని సిబ్బందితో కలెక్టర్ అన్నారు. ఇంకా డెంగ్యూ కేసులు రోజుకు ఎన్ని చేస్తున్నారని కలెక్టర్ అడుగగా రోజుకు 20 టెస్ట్ లు చేస్తున్నామని తెలిపారు.ఆస్పత్రిలో ఇంకా 600 వందల కిట్స్ ఉన్నాయన్నారు.రోజు వైరల్ ఫీవర్ వస్తున్నయనీ రోజు 300 ఓపీలు చూడటం జరుగుతుందన్నారు. ఫీవర్ కేసులు 60 నుంచి 80 కేసులు వస్తున్నాయన్నారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో డెంగ్యూ మలేరియా, వైరల్ జ్వరాలకు సంబంధించిన పరీక్షల నిర్ధారణ కిట్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ తో తెలిపారు. మక్తల్ నుండి జాతీయ రహదారి ఉండడంతో రోజు ప్రమాదాలకు సంబంధించిన కేసులు వస్తాయని, వివిధ రకాలైన జబ్బులతో ఆస్పత్రికి రోజు మూడు వందల అవుట్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఇలా ఉండగా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో సరైన సదుపాయాలు లేక ఒకే స్ట్రక్చర్ పై రెండు మూడు శవాల ఉంచాల్సి వస్తుందని రాత్రి సమయంలో పోస్టుమార్టం చేయడానికి తగిన వసతులు కల్పించాలని,అనాధ శవాలను బంధువులకు అప్పగించేంత వరకు శవాలు కుళ్ళి పోకుండా ఉండేందుకు ఫ్రీజర్ సదుపాయం లేదని సంబంధిత డాక్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న కలెక్టర్ వీటన్నిటినీ సంక్షిప్తంగా రాసి నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ డాక్టర్ ను ఆదేశించడం జరిగింది.

Advertisement

Next Story