- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం దసరా పండుగ చేసుకునేది అక్కడే...
దిశ, అచ్చంపేట : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి రెండోసారి దసరా పండుగ సందర్భంగా రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సొంతూరైన కొండారెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో బాదావత్ సంతోష్ ఇప్పటికే పలుమార్లు అన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి కలెక్టర్ ఇతర శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి సమీక్ష నిర్వహించారు.
అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పైలెట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి గ్రామం రోల్ మోడల్ గా ఉండేలా సంపూర్ణంగా సోలార్ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి హెలిప్యాడ్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనుల నోడల్ అధికారి డాక్టర్ జీవీ రమేష్, పీడీడీఆర్డీఏ చిన్న ఓబులేసు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వంగూరు మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కొండారెడ్డిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.
- Tags
- CM Revanth Reddy