- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు మార్గాన కురుమూర్తి దేవాలయానికి సీఎం…మారిన షెడ్యూల్
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : కురుమూర్తి దేవాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన రానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులకు శనివారం సాయంత్రం సమాచారం అందింది. పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి దేవాలయం వద్ద 110 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఘాట్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీసీ గుంటకు వస్తారు అని ముందస్తు సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు.
పలు కారణాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన వస్తున్నారు. దేవరకద్ర నుండి సీసీ కుంట వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం , ఆకస్మికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన వస్తున్నారు అని సమాచారం రావడంతో అక్కడక్కడ రోడ్డు మరమత్తు పనులను చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు లోపు కురుమూర్తి చేరుకుంటారు. ఘాటు రోడ్డు నిర్మాణ పనులతో పాటు, మరి కొన్ని పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం ముఖ్యమంత్రి స్వామివారిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. తిరిగి ఆయన ఒంటిగంటకు హైదరాబాద్ బయలుదేరనున్నారు.
- Tags
- Revanth Reddy