- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి: ఎమ్మెల్యే చిట్టెం
దిశ, అమరచింత: దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.50 లక్షల సీఎం నిధులతో మున్సిపాలిటీ కేంద్రంలోని 4, 5 ఎస్సీ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు, దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల వ్యయంతో, ఉచితంగా ఉపాధి అవకాశాలను కల్పించిన ఘనత తమ ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ, కమిషనర్ మహామ్మద్ ఖాజ, కౌన్సిలర్స్ రాజ్ కుమార్, సింధు, లక్ష్మీ, కో ఆప్షన్ సభ్యులు ఏపీ రాజేందర్, షాహిన్ రఫీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఎస్.ఏ.రాజు, లిఫ్ట్ అధ్యక్షుడు హెచ్ బీ రాజేందర్ సింగ్, మాజీ మార్కెట్ ఛైర్మెన్ నాగభూషణం గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, కార్యదర్శి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు గౌడ్, కార్యదర్శి బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.