- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠ్యపుస్తకాల్లో ఇప్పటికి సీఎం కేసీఆరే.. అవాక్కయిన విద్యార్థులు
దిశ,మక్తల్: విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత తెరాస ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి ల పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని పాతర్చేడ్ గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయగా ముందుమాట పేజిలో మాజీల మంత్రుల పేర్లు ఉన్నాయని, దొర్లిన తప్పులను విద్యార్థులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నిటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటం మక్తల్ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ,మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు కలవు. పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసి పంపిణీ చేస్తున్నామని తప్పుడు సమాచారాన్ని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకొని కొత్త వాటిని విద్యార్థులు అందించాలని అధికారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.