ఇండ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ దే - ఎమ్మెల్యే అబ్రహం

by Kalyani |
ఇండ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ దే - ఎమ్మెల్యే అబ్రహం
X

దిశ ఉండవల్లి : ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని అలంపూర్ శాసన సభ్యులు వి.యం.అబ్రహం పేర్కొన్నారు. శనివారం ఐజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన 227 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్న ఇండ్ల స్థలాల పట్టాలు లక్షల విలువ చేస్తాయని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని అందించామని చెప్పారు.

ఒక్కొక్క రింట్లో రెండు కల్యాణలక్ష్మి పథకాలతో రూ.2 లక్షల రూపాయలు లబ్ధి పొందిన వారున్నారని, అలాంటి వారు సీఎం కేసీఆర్‌ను మరిచి పోరాదని కోరారు. త్వరలోనే గృహ లక్ష్మి పథకం కూడా అమలు అవుతుంది అని తెలిపారు.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పట్టాల కల నెరవేరింది న్నారు. మిగిలిన వారికి కూడా పట్టాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Advertisement

Next Story