నాగరికతకు పెట్టింది పేరు పద్మశాలీలు - Minister Srinivas Goud

by Kalyani |   ( Updated:2023-08-31 13:48:44.0  )
నాగరికతకు పెట్టింది పేరు పద్మశాలీలు - Minister Srinivas Goud
X

దిశ,మహబూబ్ నగర్: నాగరికతకు పెట్టింది పేరు పద్మశాలీలని,పద్మశాలీల వల్లనే సమాజం గౌరవంగా బతుకుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన నూలు పౌర్ణమి,పద్మశాలి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పద్మశాలి కులదైవమైన మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణం కోసం స్థలం మంజూరు చేస్తే దేవాలయం నిర్మాణం చేసుకోవడం అభినందనీయమన్నారు.అలాగే పద్మశాలి కళ్యాణమండపం,స్కిల్ డెవలప్ మెంట్ కోసం 65 లక్షలు మంజూరు చేశామన్నారు.పద్మశాలీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.చేనేత కార్మికులకు చేనేత బంధు,బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని,మాది గీత,మీది నేత అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకరరావు,జిల్లా కార్యదర్శి బి.శంకర్,సంఘం నాయకులు ప్రతాప్,సత్యనారాయణ,బుచ్చన్న,శివాజి‌,వేంకటేశ్,రవిప్రకాష్, వింజపూరి రవి,పల్లాటి బాలరాజు,రాజశేఖర్,కె.సత్యనారాయణ,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

టిపోపా ఆధ్వర్యంలో పద్మశాలి ప్రతిభా పురస్కారాల ప్రదానం...

తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీపోపా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి,ఇంటర్,ఎంసెట్ లలో ప్రతిభ కనబరచిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ప్రభాకరరావు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీపోపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,బోగం నాగరాజు,దాసు పద్మనాభుడు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు...

హన్వాడ మండలం చినదర్పల్లి,చిర్మల్ కుచ్చ తాండ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్,బీజేపీ కి చెందిన కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా తో ఆహ్వానించారు.క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎంతో భవిష్యత్తు ఉంటుందని మంత్రి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed